ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఈనాడు, లిఖిత" సంయుక్తంగా కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు - కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు

ఈనాడు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు.

' కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు'

By

Published : Aug 5, 2019, 12:33 PM IST

' కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు'

ఈనాడు, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జాయింట్ రీప్లెస్ మెంట్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ కీళ్లనొప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. కీళ్లు, మెడ, నడుము నొప్పులు -నివారణ చర్యలు, ఆహార నియమాలు, ఆధునిక చికిత్సా విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈనాడు గుంటూరు యూనిట్ మేనేజర్ రామాంజనేయులు, డాక్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి: తగ్గుతున్న వరద.. రెండో ప్రమాదక హెచ్చరిక ఉపసంహరణ

ABOUT THE AUTHOR

...view details