ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భారీ వాహనాలను రాత్రి సమయంలోనే నడపాలి' - గుంటూరులో ట్రాఫిక్ నిబంధనల సమావేశం

నిత్యం రద్దీగా ఉండే రహదారులపై జేసీబీ, క్రేన్ వంటి భారీ వాహనాలు నడపవద్దని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ వాసు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

awareness meeting for traffic rules in guntur

By

Published : Nov 8, 2019, 11:41 PM IST

వాహన యజమానులతో గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సమావేశం

గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ కార్యాలయంలో క్రేన్, జేసీబీ యజమానులు, డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై జేసీబీ, క్రేన్ వంటి భారీ వాహనాలు నడపవద్దని తెలిపారు. భారీ వాహనాలను రద్దీగా ఉండే సమయంలో కాకుండా రాత్రి సమయంలో తరలించాలని... వాహనదారులకు ఇబ్బంది తలెత్తుకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details