గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు... 'జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్ని రూపొందించారు. దీని గురించి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు తడి, పొడి చెత్త బహిరంగ ప్రదేశాలలో వేయకుండా.. చెత్త బుట్టలో వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు... శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో విజయాలక్ష్మణ్ వివరించారు.
'జగనన్న స్వచ్ఛ సంకల్పం'పై సర్పంచులకు అవగాహన - Jagannanna Swachha Sankalpam Latest News
'జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమంపై నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జూమ్ యాప్ ద్వారా అవగాహన కల్పించారు. తెనాలి నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'జగనన్న స్వచ్ఛ సంకల్పం'పై సర్పంచులకు అవగాహన