అవార్డుల బాధ్యతను మరింత పెంచుతాయని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ మీరాప్రసాద్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, వలస కార్మికులకు, కరోనా బాధితులకు అందించిన సేవలను గుర్తించి హైదరాబాద్కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డుకు మీరాప్రసాద్ను ఎంపిక చేసింది. ఈ అవార్డును గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు, సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు మీరాప్రసాద్కు అందజేశారు.
అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయి. - guntur district newsupdates
అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ మీరాప్రసాద్ పేర్కొన్నారు. ఈ అవార్డును గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు. సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు మీరాప్రసాద్కు అందజేశారు.
అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి.
డీటీసీ మాట్లాడుతూ తనకు అవార్డు రావడంలో ప్రతి ఒక్క రవాణా అధికారి, ఉద్యోగుల పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో పరంధామరెడ్డి, ఎంవీఐలు బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు