విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు పరిధిలో ఆటో బోల్తా పడటంతో.. పది మందికి గాయాలయ్యాయి. మఠం గ్రామంలో మరణించిన బంధువును చూసేందుకు పెదబయలు మండలం పెదకోడాపల్లి నుంచి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుత్తులపుట్టులో.. పశువులను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ఆటోలో ఉండగా.. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో పాడేరు ఆసుపత్రికి తరలించారు.
గుత్తులపుట్టులో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు - visakha road accident news
విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

గుత్తులపుట్టులో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు