ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు - డివైడర్​ను ఢీకొని ఆటో బోల్తా న్యూస్

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై డివైడర్​ను ఢీకొని ఆటో బోల్తా పడింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరిపేట నుంచి బయల్దేరిన ఆటో.. బోయపాలేనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Auto overturns after hitting divider at Ganapavaram, Guntur district
డివైడర్​ను ఢీకొని ఆటో బోల్తా... 5గురుకి తీవ్ర గాయాలు...

By

Published : Jan 24, 2021, 10:53 AM IST

వేగంగా వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. ఆరుగురు ప్రయాణికులతో ఉన్న ఆటో.. చిలకలూరిపేట నుంచి బోయపాలెం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్​ను ఢీకొని.. బోల్తా పడినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరిని చిలకలూరిపేట ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనంలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్​తో సహా మరో నలుగురిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో ముగ్గురిని.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details