గుంటూరులో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు. డొంక రోడ్డులో తన ఆటో ఎక్కిన ప్రయాణికుడు అమరావతి రోడ్డులో దిగిపోయాడు. ఆటోలో తన బ్యాగ్ మర్చిపోయాడు. విషయం గుర్తించిన ఆటో డ్రైవర్ డేవిడ్... ఆ బ్యాగ్ తెరచి చూడగా అందులో రెండు లక్షల రూపాయలు ఉన్నాయి. బ్యాగ్‌లో నగదుతో.. పాటు ప్రయాణికుడు జూలకంటి రాజేష్ పాస్ పోర్టు ఉంది. డేవిడ్ వెంటనే నల్లపాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి నగదుతో ఉన్న సంచిని పోలీసులకు అప్పగించాడు. ఆటో డ్రైవర్ డేవిడ్ నిజాయితీని ఎస్.ఐ సుబ్బారావు మెచ్చుకున్నారు. పాస్ పోర్టు ఆధారంగా రాజేశ్‌ను పిలిపించి నగదు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ - police
ప్రయాణికుడు మరిచిపోయిన 2లక్షల రూపాయల నగదును పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.
ఆటోడ్రైవర్