Auto Driver Wife Got PhD: ఇష్టమైనవారు, మనల్ని నిత్యం ప్రోత్సహించేవారు ఉండాలే కాని సాధించలేనిది ఏదీ ఉండదు అని చెప్పేందుకు ఆ మహిళ విజయమే నిదర్శం. భర్త ఆటో డ్రైవర్. మరోవైపు పిల్లల చదువులు, వారి బాగోగులు చూసుకోవాలి. చాలీ చాలని డబ్బులు. ఇలా అనేక కష్టాలు ఉన్నా ఆమెకు తన లక్ష్యాన్ని సాధించాలనే కోరిక మాత్రం గట్టిగా ఉంది.
తాను అనుకున్న దానిని చేరుకునేందుకు ఎంతటి కష్టాన్ని అయినా సరే తట్టుకుంటానని అనుకుంది. ఓ వైపు పిల్లల్ని చూసుకుంటూనే మరోవైపు తాను కన్న కల కోసం అడుగులు వేయడం ప్రారంభించింది. పీహెచ్‌డీ సాధించిన తరువాత.. ఆ ఘనత అంతా తన భర్తకే చెందుతుందని గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన షీల అంటున్నారు.
Sake Bharati PhD story: పట్టుదలే ఆయుధం.. పీహెచ్‌డీ పట్టా సాధించిన కూలీ
ఇద్దరు పిల్లలతో పాటు తనను కూడా తన భర్త చదివించారని.. ఈ రోజు తాను సాధించిన విజయం తన భర్తదే అని ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. మా కోసం తన భర్త నిరంతరం కష్టపడ్డారని అంటున్నారు. ఎలా అయినా ప్రభుత్వం అధ్యాపకురాలను అవుతాను అంటున్న షీలా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఆటో డ్రైవర్‌తో పెళ్లి: ఈపూరి షీల గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందినవారు. తన భర్త కరుణాకర్ ఆటో డ్రైవర్. వీరిద్దరికీ 2003వ సంవత్సరంలో పెళ్లైంది. ఆ సమయంలో తాను డిగ్రీ చదువుతుంది. పెళ్లైనా సరే తన చదువును కొనసాగించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేశారు.
APPSC Group 1 Second Ranker Pavani Interview: వరుస ఓటములను తట్టుకుని గ్రూప్1లో రెండో ర్యాంక్ సాధించిన పావని..
చదువు సాగింది ఇలా..: చదువుపై తన భార్యకు ఉన్న ఇష్టాన్ని గమనించిన కరుణాకర్ షీలని ప్రోత్సహించాడు. దీంతో ఆమె తన డిగ్రీ పూర్తి చేసింది. తరువాత ఎంకామ్ చదివారు. అదే విధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంహెచ్‌ఆర్‌ఎమ్‌లో పీజీ పూర్తి చేశారు. అనంతరం 2016లో ఏపీ సెట్ రాసి అందులో క్వాలిఫై అయ్యారు. దీంతో పీహెచ్‌డీ అందుకోవాలనుకున్న తన కల మరింత చేరువైంది. ఇప్పుడు పీహెచ్‌డీ పూర్తి చేశారు.
పీహెచ్‌డీ వివరాలు..:‘ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత’ అనే అంశంపై షీల చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి నేడు షీలా పీహెచ్‌డీ పట్టా అందుకోనున్నారు. డాక్టర్ నంబూరు కిషోర్ గైడెన్స్‌లో ఆమె పీహెచ్‌డీని పూర్తి చేశారు. దీనికి కారణం తన భర్తే అని ఆమె చెబుతున్నారు.
Group 1 Ranker Sai Harshitha Interview: కోచింగ్ లేకుండా గ్రూప్-1లో సత్తా.. సాయి హర్షిత ఎలా ప్రిపేర్ అయ్యారంటే?
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..: షీలా ప్రస్తుతంతెనాలిలోని వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీలో కామర్స్ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఇంజినీరింగ్ చదువుతుండగా.. కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది. తన భర్త.. పిల్లలతో పాటు తనను కూడా చదివించారని షీల అంటున్నారు.
Chandramouli Story: విధిరాతను జయించి.. మొక్కవోని ధైర్యంతో గెలుపొందిన అనకాపల్లి యువకుడు