గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం పందిటి వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి గుత్తికొండ వెళ్లి తిరుగు ప్రయాణంలో పందిటి వారి పాలెం వద్ద ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా విద్యార్థుల్లో 10 మందికి గాయాలయ్యారు. వారిలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండగా.. బాలికను గుంటూరుకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సీ హాస్టల్ వార్డెన్ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పట్టణ సీఐ సురేంద్రబాబు విద్యార్థినులను అడిగి సంఘటనపై విచారణ చేపట్టారు.
ఆటో బోల్తా... విద్యార్థిని పరిస్థితి విషమం - ఆటో బోల్తా... విద్యార్థినీ పరిస్థితి విషమం,మరో 10 మందికి గాయాలు
బడి పిల్లలతో ప్రయాణిస్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయలవ్వగా.... విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం పిడుగురాళ్లలోని పందిటివారి పాలెం వద్ద జరిగింది.
![ఆటో బోల్తా... విద్యార్థిని పరిస్థితి విషమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4773877-787-4773877-1571249995905.jpg)
ఆటో బోల్తా... విద్యార్థినీ పరిస్థితి విషమం,మరో 10 మందికి గాయాలు
ఆటో బోల్తా... విద్యార్థినీ పరిస్థితి విషమం,మరో 10 మందికి గాయాలు
ఇవీ చదవండి