ఆటో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో బొల్లాపల్లి మండలం వెల్లటూరులో మిర్చి కోతలకు వెళ్తున్నారు. వారి ఆటోను మరో ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ... ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
రెండు ఆటోలు ఢీ, ఇద్దరు మృతి - వినుకొండలో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా వినుకొండ మండలం పెదకంచర్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... 8 మందికి గాయాలయ్యాయి. వారిని వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
auto accident