ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగార్జున సాగ‌ర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం - నాగార్జున సాగ‌ర్ గేట్లు ఎత్తేందుకు అధికారుల ప్రణాళికలు

ఎగువనుంచి వరదనీరు భారీగా చేరుతుండటంతో... నాగార్జున సాగ‌ర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 270 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

Authorities prepare to lift Nagarjuna Sagar gates
నాగార్జున సాగ‌ర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం

By

Published : Aug 20, 2020, 9:42 PM IST

ఎగువనుంచి వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగ‌ర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి 2 లక్షలకు క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వ‌ర‌ద‌నీరు వస్తోంది. శుక్రవారం మధ్యాహ్నంలోగా సాగ‌ర్ గేట్లు తెరిచే అవ‌కాశం ఉందని... ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమ‌త్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సాగర్ లో 270 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు. ఎగువనుంచి వరదనీరు భారీగా వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టులో 46 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా... ప్రస్తుతం అక్కడ 18 టీఎంసీల నీరుంది. పులిచింతల నిండితే అక్కడి నుంచి నీటికి ప్రకాశం బ్యారేజికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details