గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో జన సంచారంపై ఆంక్షలు మెుదలయ్యాయి. వైరస్‌ని కట్టడి చేసే క్రమంలో బయటి ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నేటి నుంచి దుకాణాల పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పటికే తమ సమ్మతిని తెలియజేసింది. దీంతో 6 గంటల తర్వాత పోలీసులు వాహనాల్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ దుకాణాలు మూసివేయాలని మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. జిల్లాలో నమోదయ్యే కేసుల్లో 50 నుంచి 60 శాతం గుంటూరులోనే ఉన్నాయి. మందుల దుకాణాలు, ఆసుపత్రులు, ల్యాబులు, పెట్రోల్ బంకులు, పాల బూత్‌లకు మినహయింపునిచ్చారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంటూరులో ఆంక్షలు
గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు తగు చర్యలు చేపట్టారు. దుకాణాల పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలపాలకు అనుమతినిచ్చారు.
గుంటూరులో మూసేసిన దుకాణాలు