ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Book on State Audit Director: వేధింపులకు విసిగిపోయి.. స్టేట్ ఆడిట్ డైరెక్టర్​ అక్రమాలపై పుస్తకం - State Audit Director

Book on Director of State Audit Hari prakash: స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్.. అక్రమాలు, వేధింపులు పేరిట.. ఆ శాఖకు చెందిన ఉద్యోగులంతా కలిసి పెద్ద పుస్తకాన్ని అచ్చు వేయించి పంపిణీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏడాది నుంచి హరిప్రకాశ్ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని.. ఆయన వేధింపులకు విసిగిపోయి పుస్తకం తీసుకొచ్చామని ఉద్యోగులు అన్నారు. రాష్ట్రస్థాయి అధికారిగా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ఇందుకు సాక్ష్యాలను కూడా పుస్తకంలో పొందుపరిచినట్టు ఆడిట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.

AP State Audit Director Hariprakash
ఏపీ స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రకాశ్

By

Published : Jul 7, 2023, 10:48 PM IST

స్టేట్ ఆడిట్ డైరెక్టర్ వేధింపులు, అక్రమాల పేరిట పుస్తకం.. పంపిణీ చేస్తున్న ఉద్యోగులు

Book on Director of State Audit Hari prakash: రాష్ట్రస్థాయి అధికారి అయిన స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్ వేధింపులపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన వేధింపులు, అక్రమాలు, నమోదైన అభియోగాలతో పాటు పెద్దఎత్తున ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించి 600 పేజీల పుస్తకాన్ని పంపిణీ చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఆయన వేధింపులపై ఆందోళనలు, నిరసనలు, విజ్ఞాపనలు చేపట్టిన ఉద్యోగులు.. ఏకంగా ఓ పుస్తకాన్నే అచ్చు వేయించి పంపిణీ చేశారు.

వివిధ క్రిమినల్ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నా.. శాఖాపరమైన విచారణలో ఆయనపై నమోదైన అభియోగాలు నిజమని నిర్ధారణ అయినా.. ఆర్. హరిప్రకాశ్‌ను స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా రాష్ట్రప్రభుత్వం కొనసాగించటంలో అర్ధం ఏమిటని ఆడిట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2012లో తిరుపతిలో అకౌంట్స్ ఎగ్జామినర్‌గా ఉన్నప్పటి నుంచే హరిప్రకాశ్‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినా.. అభియోగాలు నమోదైనా.. రాజకీయ ఒత్తిళ్లతో స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్నారని.. ఆడిట్ విభాగం ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు.

అక్రమంగా సంపాదించిన డబ్బుతో తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తులు కొనుగోలు చేశారని పేర్కొంటూ.. ఆధారాలతో సహా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, నగదు చెల్లింపు రసీదుల నకళ్లను ఆ పుస్తకంలో ఆడిట్ ఉద్యోగులు పొందుపరిచారు.

తిరుపతిలోని స్టేట్ ఆడిట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఆయన రేణిగుంట సమీపంలోని చెంగారెడ్డిపల్లెలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా 21 ఎకరాల మేర భూమి కొనుగోలు చేసిన పత్రాలను.. ఆయన ఖాతాకు ఓ ఎన్నారై నుంచి 70 లక్షల రూపాయల నిధులు జమ అయిన రశీదులనూ పొందుపరిచారు.

ఈ వ్యవహారంపై నమోదైన ఫిర్యాదులపై ప్రభుత్వం చేసిన శాఖాపరమైన విచారణలోనూ ఆయనపై ఈ అభియోగాలు నిజమని నివేదికలో తేలిందన్నారు. ఇన్ని ఉన్నా ఆయన్ను స్టేట్ ఆడిట్ డైరెక్టర్ గా కొనసాగించటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా ఉండి తన పేరుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని.. ఉద్యోగులు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లోనూ డబ్బులు తీసుకునే.. ఇష్టానుసారం చేశారని ఆరోపించారు. జిల్లాల విభజన జరిగినా ఆర్డర్ టూ సర్వ్ పేరిట ఉత్తర్వుల మేరకు సీనియారిటీ పాటించకుండా కావాల్సిన వారికే బదిలీలు చేశారన్నారు.

అదే సమయంలో పాత జిల్లాల్లోని జిల్లా ఆడిట్ అధికారులను ఇష్టానుసారంగా కావాల్సిన వారినే ఇంఛార్జులుగా నియమించుకున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారాలపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, సలహాదారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. అధికార పార్టీకి అనుకూలమైన అధికారిగా ఉన్నందునే ప్రభుత్వం ఆయనను కొనసాగిస్తోందంటూ ఆడిట్ ఉద్యోగులు తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details