Peddakakani temple Canteen: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానం క్యాంటీన్లో.. మాంసాహారం వండటంపై దుమారం రేగి.. లైసెన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. శనివారం రాత్రి క్యాంటీన్ వెనక డోర్ నుంచి సామాన్లు తరలించేందుకు.. గుత్తేదారుకు సంబంధించిన వ్యక్తులు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు ఆలయ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
Peddakakani Temple: పెదకాకాని ఆలయ క్యాంటీన్ సామాన్లు తరలించేందుకు యత్నం..! - పెదకాకాని ఆలయ క్యాంటీన్ సామాన్లు తరలించేందుకు యత్నం వార్తలు
Peddakakani temple Canteen: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానం క్యాంటీన్లో.. మాంసాహారం వండటంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే.. శనివారం రాత్రి క్యాంటీన్ వెనక డోర్ నుంచి సామాన్లు తరలించేందుకు.. గుత్తేదారుకు సంబంధించిన వ్యక్తులు ప్రయత్నించారు. ఘటనపై.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pedakakani malleswara swamy temple: గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఈ నెల 8న ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు.. క్యాంటీన్‌ను సీజ్ చేశారు. ఈనెల 1న క్యాంటీన్ నిర్వహణ నిర్వాహకుడు లైసెన్సు పొందినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ తీసుకున్న వారం రోజుల్లోనే నిబంధనల ఉల్లంఘించడం తీవ్ర విమర్శలకు తావించ్చింది. క్యాంటీన్ నిర్వహణ లైసెన్స్ రద్దుచేస్తూ దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ డిపాజిట్‌ను జరిమానా కింద జమ చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: