ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వార్డు వాలంటీర్​పై మహిళల దాడి

By

Published : Jul 7, 2020, 7:41 AM IST

ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల జాబితాలో తమ పేరు లేకపోవడానికి వాలంటీరే కారణమంటూ అతని ఇంటిపై స్థానిక మహిళలు దాడి చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో వార్డు వాలంటీర్​తో స్థానిక మహిళలు ఘర్షణకు దిగారు. తమకు అర్హత ఉన్నా ఇళ్ల స్థలాల్లో తమ పేరు నమోదు కాకపోవడానికి వాలంటీరే కారణమని ఆ ప్రాంత మహిళలు ఆరోపిస్తున్నారు.

Attacking women
Attacking women

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పాలకేంద్రం ఎదురుగా ఉన్న 20వ వార్డుకు చెందిన వాలంటీర్ శివరాత్రి శ్రీను, అతని కుటుంబ సభ్యులతో స్థానిక మహిళలు ఘర్షణకు దిగారు. ఇళ్ల స్థలాల్లో తమ పేరు లేకపోవడానికి కారణం ఆ వార్డు వాలంటీరేనంటూ ఆందోళన చేశారు. తన భర్త తప్పులేదు అన్న కారణంతో వాలంటీర్ భార్యపైనా స్థానిక మహిళలు దాడి చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలకు సద్దిచెప్పి పంపించేశారు. గాయపడిన వారిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై బ్రహ్మం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details