గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలకు చెందిన 29 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నాలుగు లక్షల 15 వేల ఎనిమిది వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పలపాడు గ్రామంలో పుచ్చకాయల చెరువు వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను, వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్ష ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 34 మంది అరెస్ట్ - వేర్వేరు పేకాట స్థావరాలపై దాడి-34 మంది అరెస్ట్,రూ.5.20 లక్షలు స్వాధీనం
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. అలాగే ఉప్పలపాడు గ్రామంలో పుచ్చకాయల చెరువు వద్ద జూదమాడుతున్నట్లు గుర్తించారు. రెండు దాడుల్లో 34 మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వేర్వేరు పేకాట స్థావరాలపై దాడి-34 మంది అరెస్ట్,రూ.5.20 లక్షలు స్వాధీనం