మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని సాలిపేటలో ఘర్షణ జరిగింది. తనతో పాటు.. మరో వ్యక్తిపైనా దాడి జరిగిందని స్థానికుడు అబ్దుల్లా ఆరోపించారు. వైకాపాకు పురపాలక ఎన్నికల్లో మద్దతు ఇవ్వని కారణంగానే తమపై దాడి జరిగిందని ఆరోపించారు.
తెనాలి 17వ వార్డులో తెదేపాకు తాము అనుకూలంగా నడుచుకోవడమే దాడికి కారణమని అన్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బుధవారం రాత్రి తమతో గోడవపెట్టుకున్నారని.. ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.