ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ అరాచక ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్నావు చిన్నా: చంద్రబాబు - attack-on-sc-jac-leader

అమరావతి ఎస్సీ ఐకాస నేతపై దాడి
అమరావతి ఎస్సీ ఐకాస నేతపై దాడి

By

Published : Sep 18, 2021, 4:41 PM IST

Updated : Sep 18, 2021, 7:33 PM IST

16:38 September 18

Attack on SC JAC Leader

అమరావతి ఎస్సీ ఐకాస నేతపై దాడి

గుంటూరు జిల్లాలో దుండగుల దాడిలో గాయపడిన అమరావతి ఎస్సీ ఐకాస నేత పులి చిన్నా  విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు. దాడికి సంబంధించిన పోలీసు కేసు, రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు చంద్రబాబు సూచించారు. 

"ఈ అరాచక ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్నావు చిన్నా" -చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ అధినేత
 

తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి ఎస్సీ ఐకాస నేత అయిన పులి చిన్నాపై దాడి జరిగింది. బాపట్ల ఎంపీ అనుచరులే తనపై దాడి చేశారని పులి చిన్నా తెలిపారు. చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై ఫిర్యాదు చేశాననే తనపై దాడి చేశారని చిన్నా ఆరోపించారు. 

"చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై ఫిర్యాదు చేశానని.. తనపై బాపట్ల ఎంపీ అనుచరులు దాడి చేశారు. దయచేసి ఎవ్వరూ..వైకాపా అధినేత మీదకి వెళ్లకండి." -పులి చిన్నా,అమరావతి ఎస్సీ ఐకాస నేత

ఇదీ చదవండి:TDP: 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'

Last Updated : Sep 18, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details