గుంటూరులో జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో... స్థానిక ఎన్నికల జనసేన అభ్యర్థి చిందుకూరి శ్రీనివాసరావుపై.. వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. నామపత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తుండగా.. మార్గ మధ్యంలో అడ్డుకున్నారని బాధితుడు తెలిపారు. నామినేషన్ వేయకుండా వెళ్లిపోవాలని బెదిరించారని ఆరోపించారు. పత్రాలు లాక్కుని, చింపేసి.. దాడి చేశారని ఆవేదన చెందారు. దాడిలో గాయపడిన ఆయనను.. జనసేన నేతలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి సయ్యద్ జిలానీ.. శ్రీనివాసరావును పరామర్శించారు.
జనసేన అభ్యర్థిపై వైకాపా నాయకుల దాడి - latest news of municipal elections news
గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. జనసేన అభ్యర్థి చిందుకూరు శ్రీనివాసరావుపై దాడి చేశారు. నామపత్రాలు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు.
జనసేన అభ్యర్థిపై దాడిచేసిన వైకాపా నాయకులు