వైకాపా రెబల్ సర్పంచి అభ్యర్థి కుమారుడిపై అదే పార్టీకి చెందిన మరో వర్గం దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేపూడి గ్రామం నుంచి వైకాపా మద్ధతుతో సర్పంచి అభ్యర్థిగా చిట్టా అంజినీదేవి పోటీ చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తాటిపర్తి కుమారి వైకాపా రెబల్ సర్పంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం బూత్‌లలో ఏజెంట్ల నియామకం జరుగుతోంది.
రేపూడి గ్రామంలో వైకాపా వర్గీయుల దాడి
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో వైకాపా రెబల్ సర్పంచి అభ్యర్థి కుమారుడిపై అదే పార్టీకి చెందిన మరో వర్గం దాడికి పాల్పడ్డారు.
రేపూడి గ్రామంలో వైకాపా వర్గీయుల దాడి
ఆ సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా రెబల్ అభ్యర్థి కుమారుడు జ్ఞానేశ్వరరెడ్డిపై కర్రలతో దాడి చేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పంపించి వేశారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఫిరంగిపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ఇదీ చదవండి:2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్