తెదేపా తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి తమపై ఏదో ఒక కారణంతో వైకాపా వర్గీయులు దాడులు చేస్తున్నారని...గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎస్సీ కాలనీకి చెందినవారు వాపోతున్నారు. గత మార్చి నెలలో చిరుమామిళ్ల ఎంపీటీసీ తెదేపా అభ్యర్థిగా ఎస్సీ కాలనీకి చెందిన కట్టా దివ్య పోటీ చేసింది. ఎన్నికలు నిలిచిపోయినా... దివ్య కుటుంబ సభ్యులపై ఏదో ఒక కారణంతో వైకాపాకు చెందినవారు దాడులు చేస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెదేపా, వైకాపా వర్గీయులు కర్రలతో దాడి..ఐదుగురికి తీవ్ర గాయాలు - YCP Attck on TDP cadre
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం తెదేపా సానుభూతిపరులపై వైకాపా వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో తెదేపా వర్గీయులకు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం తగాదా పెట్టుకొని రాళ్లు, కర్రలతో వైకాపా వర్గీయులు దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మరికొంత మంది స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గతంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ప్రతిసారీ ఇలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు రాలేదని వాపోతున్నారు. తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ... 'చంద్రబాబు రాజీనామా చేసి గెలిస్తే.. ఆ నిర్ణయం విరమించుకుంటాం'