ఫలితాలు వచ్చి ఏడాది... ఇంకా భర్తీ కాని ఖాళీలు - అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీల
పరీక్షా ఫలితాలు విడుదలై ఏడాదిన్నర దాటింది. కానీ ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. మంత్రులు, అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇది విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారి ఆవేదన. తమకు న్యాయం చేయాలంటూ ఇవాళ ఆందోళన నిర్వహించారు.
నిరసన
విశ్వవిద్యాలయాలలో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన తమకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలంటూ గుంటూరులోని ఏఎన్యూ వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. పరీక్షా ఫలితాలు విడుదలై ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఇంటర్వ్యూలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1200 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. నూతన ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.