ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే' - వంశీపై స్పీకర్ తమ్మినేని సీతారం న్యూస్

శాసనసభలో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'

By

Published : Nov 23, 2019, 2:29 PM IST

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'

ప్రజా సమస్యలు పరిష్కారమవ్వాలంటే అసెంబ్లీలో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సభాపతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సభాపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తనకు తెలిసినంత వరకు తెదేపాకు రాజీనామా చేశారని సభాపతి అన్నారు. శాసనసభ సమావేశాల్లో వంశీ స్వతంత్రంగా వ్యవహరిస్తారా లేదా అనేది వంశీ ఇష్టమని తెలిపారు. సమావేశాలు మొదటిరోజు వంశీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో సభాపతి స్థానాన్ని అగౌరపరిచేలా చిత్రీకరణ ఉందని విమర్శించారు. అది ఆ దర్శకుడి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details