MLC Ashok Babu Bail petition: బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. బెయిల్ ఇవ్వాలని అశోక్‌బాబు తరపున న్యాయవాదులు పిటిషన్లో కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.
తప్పుడు విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రమోషన్ పొందారనే ఆరోపణలపై సీఐడీ అధికారులు అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు..
ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం..
అశోక్‌బాబు అరెస్ట్ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్ చేశారు. అశోక్‌బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్‌బాబును చూపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సంబంధిత కథనాలు: