KG to PG in Telangana: అన్ని కోర్సుల్లో కలిపి 1899 మంది విద్యార్థులు ఉన్నారు. విశాలమైన గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినేలా భోజనశాల ఉంది. ఆటల కోసం ప్రత్యేకంగా సింథటిక్‌తో రూపొందించిన మైదానం ఉంది. ఇందులో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో 1964లో ప్రారంభించిన పాఠశాల కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతుండగా, నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇక్కడే వేర్వేరుగా ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాలయాలను ఒకే ఆవరణలోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. దాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ముందడుగు పడింది. గివ్ తెలంగాణ, కె రహేజా సంస్థలు.. ఈ ప్రాంగణం ఆధునికీకరణకు ముందుకొచ్చాయి.