ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆరుద్రోత్సవాలు - కోటప్పకొండలో శివుని ఉత్సవాలు తాజా సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.

Arudrotsava celebrations
ఘనంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆరుద్రోత్సవ వేడుకలు

By

Published : Dec 30, 2020, 3:18 PM IST

రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన గుంటూరు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. త్రికోటేశ్వరునికి జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించి లింగోద్భవకాలంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. జ్యోతి దర్శన సమయంలో భక్తులు హారతులు ఇస్తూ... స్వామి వారిని స్మరిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. అలాగే ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. మేధాదక్షిణామూర్తి మాల ధరించిన భక్తులు ఆలయానికి హాజరై దీక్షా విరమణ చేశారు. వీరికి ఆలయ అధికారులు దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సర్వేశ్వరుడిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details