ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాణ్యమైన సేవలు అందిస్తూ దూసుకుపోతున్న 'మహిళా బ్యాంకు' - గుంటూరు మహిళా బ్యాంకు వార్తలు

ఇంటి ఆర్థిక నిర్వహణలో మహిళలదే కీలకపాత్ర. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆర్థిక పరంగా కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించడంలో వనితలకు ఎవరూ సాటిరారు. అందుకే మహిళా శక్తితోనే బ్యాంకు నిర్వహించాలన్న ఆలోచన మంచి ఫలితాలు సాధిస్తోంది. స్వయం సహాయక బృందాలకు చక్కని సౌకర్యాలు, నాణ్యమైన సేవలు అందిస్తూ మన్ననలు అందుకుంటోంది గుంటూరులోని మహిళా బ్యాంకు.

women bank
నాణ్యమైన సేవలు అందిస్తూ దూసుకుపోతున్న 'మహిళా బ్యాంకు'

By

Published : Nov 12, 2020, 2:25 PM IST

మహిళల నేతృత్వంలో మహిళల కోసమే ఏర్పాటైన బ్యాంకు స్వయం సహాయక సంఘాల వారికి సేవలందించడంలో దూసుకుపోతోంది. డ్వాక్రా, మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సభ్యులు బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిని నివారించేందుకు.. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం మహిళా బ్యాంకు ఆలోచన చేసింది. గత జులైలో నల్లపాడులో ప్రారంభించిన మహిళా బ్యాంకు శాఖ ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. సత్వర సేవలు అందడం సహా... మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

కొత్త బ్యాంకు ఏర్పాటుతో డ్వాక్రా మహిళల కొత్త గ్రూపుల ఏర్పాటు సులభతరంగా మారింది. ప్రతిరోజూ 15 వరకూ కొత్త గ్రూపులు ఏర్పాటు అవుతుండటమే ఇందుకు నిదర్శనం. స్వయం సహాయక గ్రూపులతో పాటు... బంగారం, ఇల్లు, పశువులు, గొర్రెల కొనుగోలు రుణాలు మహిళా బ్యాంకులో అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 600 కోట్ల రూపాయల లావాదేవీలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ మహిళా బ్యాంకులో రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే అప్పు మంజూరు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

సలాం కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థికసాయం

ABOUT THE AUTHOR

...view details