గుంటూరు జిల్లా గడ్డిపాడులో జూన్లో పోలీసులు జరిపిన తనిఖీలలో రెండు ఇసుక లారీలను సీజ్ చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. పరారైన మరో ఇద్దరు వ్యక్తులను ఈరోజు హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో ఇసుక నకీలీ పాసులు సృష్టించి..అక్రమాలకు పాల్పడుతున్న బత్తిన మహేంద్ర, బత్తుల తిరుపతిలను గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. రాజు విజయ రెడ్డి , కన్నెగంటి వివేక్ తేజలు ఇద్దరు అప్పుడు పరారవ్వగా.. ఈ రోజు వారిని హైదరాబాద్లో పట్టుకున్నారు. వీరితో పాటుగా ఈ వ్యవహారంలో ఏపీఎండీసీ అవుట్సోర్సింగ్ సిబ్బంది పాత్ర ఉన్నందున ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇసుక అక్రమ తరలింపు కేసులో పరారైన మరో ఇద్దరు అరెస్ట్ - గడ్డిపాడులో ఇసుక అక్రమదారుల అరెస్ట్ వార్తలు
గుంటూరు జిల్లా గడ్డిపాడులో జూన్లో పోలీసులు జరిపిన తనిఖీలలో రెండు ఇసుక లారీలను సీజ్ చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. పరారైన మరో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు.

గడ్డిపాడులో ఇసుక అక్రమదారుల అరెస్ట్
అక్రమాలకు పాల్పడే కేటుగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. ఇసుక కావలసినవారు ప్రభుత్వ స్టాక్ పాయింట్ నుండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని తెప్పించు కోవాలని అక్రమార్కులకు సహకరించవద్దని తెలియజేశారు.
ఇదీ చూడండి.చిరంజీవి భాజపాలోకి వస్తానంటే.. స్వాగతిస్తాం: విష్ణు వర్ధన్ రెడ్డి