ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BLACK FUNGUS: బ్లాక్​ మార్కెట్​లో ఆంపోటెరాసిన్ బి ఇంజెక్షన్ల విక్రయం.. ముఠా అరెస్ట్

By

Published : Jun 20, 2021, 3:39 PM IST

Updated : Jun 20, 2021, 4:40 PM IST

బ్లాక్​ఫంగస్ వ్యాధి నియంత్రణలో కీలకంగా మారిన ఆంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న ఎనిమిది మందిని గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 46 అంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లు, 3 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఆంపోటెరాసిన్ బీ ఇంజెక్షన్లను నల్లబజారులో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ఆంపోటెరాసిన్ బీ ఇంజెక్షన్లను నల్లబజారులో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

బ్లాక్ ఫంగస్ వ్యాధితో భయాందోళనలు నెలకొన్నవేళ... వారి అవసరం, కష్టాన్నే కాసులుగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. బ్లాక్ ఫంగస్ నియంత్రణలో కీలకంగా మారిన ఆంపోటెరాసిన్ బీ ఇంజెక్షన్లను నల్లబజారులో విక్రయిస్తూ ఎనిమిది మంది గుంటూరు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 46 అంపోటెరాసిన్ బీ ఇంజెక్షన్లను... ఇప్పటికే 64 ఇంజెక్షన్లను విక్రయించగా వచ్చిన 3 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశంలో వివరించారు.

ఈ ఇంజెక్షన్లను హోల్ సేల్ మార్కెట్​లో విక్రయించే విజయవాడకు చెందిన సరఫరాదారుతో పాటు మెడికల్ రిప్రజెంటేటివ్​లు ఏకమై నల్లబజారులో ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. గరిష్ఠ చిల్లరధర ప్రకారం 1700 రూపాయలకు లభించే అంపోటెరాసిన్ ఇంజెక్షన్లను.. నల్లబజారులో రూ.25వేల చొప్పున అమ్ముతున్నారని డీఐజీ వివరించారు. ప్రభుత్వం ఈ కీలక మందుల్ని అందుబాటులో ఉంచుతుందని.. ఎవరూ నల్లబజారులో కొనవద్దని డీఐజీ త్రివిక్రం వర్మ కోరారు.

ఇదీ చదవండి:కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!

Last Updated : Jun 20, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details