ఈనెల 31 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు గుంటూరు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాపించకుండా విద్యార్థుల మధ్య కనీసం మీటరు దూరం ఉండేటట్టు చూడాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో 60వేలకు పైగా విద్యార్థులు హాజరవుతుండగా.. 209 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
గుంటూరులో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు - గుంటూరులో పదోతరగతి పరీక్షలు వార్తలు
పదో తరగతి పరీక్షలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు.
Arrangements for Tenth Class Examinations in Guntur