ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జొన్నకు మద్దతు ధర రూ.1,850.. కొనుగోలుకు అధికారుల ఏర్పాట్లు - గుంటూరు నేటి వార్తలు

క్వింటాలుకు రూ. 1,850 మద్దతు ధరతో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో జొన్న కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విజయభారతి తెలిపారు.

sorghum buying arrangements in Guntur
జొన్న కొనుగోలుకు ఏర్పాట్లు

By

Published : Apr 13, 2021, 4:45 PM IST

గుంటూరు జిల్లాలో రైతులు పండించిన జొన్న కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్వింటాలుకు రూ. 1,850 మద్దతు ధరను ప్రభుత్వం ఖరారు చేసినట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విజయభారతి తెలిపారు. మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు చేపట్టామని.. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్​లో నమోదు చేసుకుని ఉండాలని ఆమె స్పష్టం చేశారు. జొన్నలో 14లోపే తేమశాతం ఉండేలా ఆరబెట్టుకోవాలని.. మధ్యవర్తుల మాటలు నమ్ని మోసపోవద్దని రైతులకు సూచించారు.

'జొన్న పంట అమ్మాలనుకునేవారు.. సీఎం యాప్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలోనే పంట నూర్పిడి ఏ రోజు చేస్తారో నమోదు చేయాలి. అనంతరం ఏ రోజు జొన్నలు విక్రయించాలో రైతు చరవాణికి సందేశం వస్తుంది. అయితే రిజిస్ట్రేషన్​ సమయంలో వినియోగించిన ఫోన్​ నంబర్.. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉండాలి' అని సంచాలకులు విజయభారతి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details