యువ ఓటర్లను చైతన్య పర్చడానికి కృషి చేస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఓటు హక్కు సరళిపైన అవగాహన ర్యాలీ, ప్రత్యేక వీడియోలు రూపొందించి కళాశాలల్లో, పాఠశాలలో సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్నామన్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలతో.. నిరంతరం నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యేలా చూస్తున్నామన్నారు.
15 సంవత్సరాల తర్వాత గుంటూరులో మున్సిపల్ ఎన్నికలు - Guntur Municipal Corporation Commissioner Challa Anuradha news
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ
పోస్టల్ బ్యాలెట్, ఓటర్లు తమ ఓట్లను ఆన్లైన్లో చూసుకోవడానికి ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 15 సంవత్సరాల తరువాత గుంటూరు నగరంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఇదీ చూడండి.ప్రత్యేక హోదా పేరు తప్ప.. ఆ రూపేణా చాలానే నిధులొచ్చాయ్..!