Margadarshi Chitfunds: చిట్‌ఫండ్స్ చట్ట నిబంధనల మేరకు.. చట్టబద్ధ విధులను నిర్వర్తించేలా రిజిస్ట్రార్లను ఆదేశించాలని.., నిర్దిష్ట గడువులో తమ అభ్యర్థనలను పరిష్కరించకుండా.., నిబంధనల మేరకు నడుచుకోలేదనే కారణం చూపి తమపై జరిమానా విధించకుండా నిలువరించాలని., తొందరపాటు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి.. అనుబంధ పిటిషన్లపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..తీర్పు వాయిదా..! - మార్గదర్శి చిట్ ఫండ్స్ పై హైకోర్టు తీర్పు
Margadarshi Chitfunds: చిట్‌ఫండ్స్ చట్ట నిబంధనల మేరకు..మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో.. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకుకోకుండా రిజిస్ట్రార్లను ఆదేశించాలని సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి.. తీర్పు ఏం వచ్చిందంటే..!
మార్గదర్శి చిట్‌ఫండ్స్