ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2023, 9:48 PM IST

ETV Bharat / state

Ambedkar Jayanti: వేడుకల్లో వాగ్వాదాలు.. ఆరోపణలు.. హెచ్చరికలు

Arguments in Ambedkar Jayanti Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అయితే కొన్ని ప్రాంతాలలే నేతల మధ్యం వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అదే అనంతపురంలో దళితులు హెచ్చరికలు చేశారు.

Arguments in Ambedkar Jayanti Celebrations
వేడుకల్లో వాగ్వాదాలు

అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో వాగ్వాదం

Arguments in Ambedkar Jayanti Celebrations: కర్నూలులో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి మారెప్పకు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేడుకలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే కాటసాని మాట్లాడి వెళ్లిపోతుండగా.. వెంటనే మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ ల్యాండు, శ్యాండు కబ్జాలు చేసిన వారు మాట్లాడి వెళ్లిపోతున్నారని రాంభూపాల్​రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

రాంభూపాల్ రెడ్డి మళ్లీ వేదిక పైకి వచ్చి.. మైకు ఉందని ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదన్నారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే ఊరుకోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా తాను అక్రమాలకు పాల్పడితే నిరూపించాలని ఆవేశంతో మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం ఏర్పడడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

మంత్రుల గన్​మెన్లకు వార్నింగ్ ఇచ్చిన దళిత సంఘాల నేతలు

తాట తీస్తాం అంటూ హెచ్చరిక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్​ విగ్రహం వద్దకు చెప్పులు వేసుకుని ఎవరైనా వస్తే తాట తీస్తామని వైసీపీ నేతల సమక్షంలో.. మంత్రుల గన్​మెన్లపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేయడానికి అనంతపురం జిల్లా మంత్రి ఉషాశ్రీ చరణ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు.

అయితే వారి వెంటే మంత్రుల గన్మెన్లు చెప్పులు వేసుకొని అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లారు. చెప్పులు తీసివేసి విగ్రహం వద్దకు రావాలని దళిత సంఘాల నేతలు చెబుతున్నా వైసీపీ మంత్రుల గన్మెన్లు పెడచెవిన పెట్టారు. దీంతో చెప్పులు వేసుకుని ఎవరైనా విగ్రహం వద్దకు వస్తే తాట తీస్తామని దళిత సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కన్నాను అడ్డుకున్న వైసీపీ నేతలు

పూలమాల వేయడానికి వీళ్లేదు.. కన్నాను అడ్డుకున్న వైసీపీ నేతలు: గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద వివాదం చోటుచేసుకుంది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ముందుగా మీరు పూలమాల వేయడానికి వీల్లేదంటూ వారించారు. ఇలా కాసేపు తోపులాట జరిగిన తరువాత.. కన్నా లక్ష్మీనారాయణ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించి వెళ్లిపోయారు. వెంటనే ఆయన వేసిన పూలమాలను వైసీపీ తీసేశారు.

అనంతరం అక్కడికి వచ్చిన గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు.. ఈ విషయంపై స్పందించారు. అధికారులు, మంత్రులు విగ్రహాన్ని ప్రారంభించకుండా.. టీడీపీ నాయకులు విగ్రహానికి దండలు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. ఒక దళితుడ్ని తోసేసి.. అంబేడ్కర్ విగ్రహానికి కన్నా లక్ష్మీ నారాయణ పూలమాల వేస్తే.. అది అంబేడ్కర్​కి నిజమైన నివాళి ఎలా అవుతుందని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక దళితుడిపై దాడి చేశారంటూ ఆరోపించారు. వెంటనే కన్నా క్షమాపణలు చెప్పాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details