భాజపా రాష్ట్ర నేతలు నిద్రపోతున్నారా?..లేక నిద్ర నటిస్తున్నారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. రాజధాని అంశంపై కేంద్రం వద్ద ఇప్పటివరకు ఒక్కరు కూడా నోరు మెదపలేదని మండిపడ్డారు.
భాజపా రాష్ట్ర నేతలు నిద్రపోతున్నారా?: సీపీఐ నేత రామకృష్ణ
భాజపా రాష్ట్ర నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి అంశంపై భాజపా రాష్ట్ర నేతలు ఒక్కసారైనా కేంద్రం వద్ద నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ప్రధానికి కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు వంటి అంశాలు రాష్ట్రంలో పెను వివాదాల్ని సృష్టిస్తున్నాయి. వీటిపై హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి రాసిన లేఖపై పీఎంవో స్పందించివివరాలు ఆరా తీసింది. రాష్ట్ర భాజపా నేతలు ఈ అంశాలపై ఒక్కసారైనా కేంద్రం వద్ద నోరు మెదపలేదు. ప్రధానికి కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. ఏపీకి చెందిన భాజపా ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికైనా మేల్కొని అమరావతే రాజధానిగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి