గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్ ఆరో లైన్లో నివాసముండే మరియదాసుకు... మరియమ్మ అనే మహిళతో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. మరియదాసు మార్బుల్స్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు వేమూరు మండలంలోని పెరవలి గ్రామంలో ఉంటోంది. కూతురును చూసేందుకు మరియమ్మ వారానికి ఒకసారి పెరవలికి వెళ్తోంది. ఈక్రమంలో ఆటో డ్రైవర్ అనిల్ బాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి ఇద్దరి మద్య వివాహేతర సంబంధంగా మారింది.
గొంతుకు తాడు బిగించి, రోకలి బండతో మోది...
వివాహేతర సంబంధం గురించి మరియదాసుకు తెలిసి మరియమ్మను మందలించాడు. దీంతో అక్రమ సంబంధానికి మరియదాసు అడ్డు వస్తున్నాడని, అతని అడ్డు తొలగించుకోవడానికి భార్య మరియమ్మ... ప్రియుడితో కలసి పథకం పన్నారు. ఈనెల 7 అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరియదాసు నిద్రిస్తుండగా.. అనిల్, మరియమ్మ ఇద్దరూ మరియదాసు గొంతుకు తాడు బిగించి, రోకలిబండతో తలపై బలంగా కొట్టి హతమార్చారు.