ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గుంటూరు జిల్లా గణపవరంలో ఉన్న అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మను ఇదే కేసులో జి.మాడుగుల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈమె భర్త లక్ష్మయ్య 15 ఏళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పెదబయలు మండలానికి చెందిన మావోయిస్టుల సానుభూతిపరుడు నాగన్న ఇచ్చిన సమాచారం ఆధారంగానే 64 మందిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గాజర్ల రవి, రామచంద్రరెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతితో పాటు మరికొందరు మావోయిస్టు నేతలున్నారు. మరోవైపు మావోయిస్టు సానుభూతిపరురాలు రాజేశ్వరిపై పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌లో ఈ నెల 24న పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూపునకు చెందిన కంభంపాటి చైతన్య, మరో 26 మందిని గుంటూరు జిల్లా జూలకల్లులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హక్కులపై దాడికే..