ప్రకాశం బ్యారేజి అన్ని గేట్లు ఎత్తివేయటంతో వరద ప్రవాహం పెరిగి గుంటూరు జిల్లా రేపల్లెలోని పెనుముడి వద్ద నీరు కరకట్టకు చేరుకున్నాయి. రేవుకు గండి పడటంతో సుమారు 100 ఎకరాల రొయ్యల చెరువులు నీట మునిగాయి. ఒక్కో ఎకరానికి సుమారు 1లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ఆక్వా రైతులు తెలిపారు. వరద వల్ల పంట మొత్తం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వరద రావడంతో చెరువులలో మోటార్లు కూడా నాశనమయ్యాయని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
పెరిగిన వరద.. ఆందోళనలో ఆక్వా రైతులు - రేపల్లే వరదలు
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో వరద ప్రవాహం పెరగటంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 100 ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు నీట మునగటంతో పంట మెుత్తం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద దాటికి ఆక్వా రైతుల ఆవేదన