Special buses for Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈసారి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
శుభవార్త.. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Special buses for Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశాలిచ్చింది.
ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ సహా చెన్నై, కోల్కతా, ముంబై తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు అధిక బస్సులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా ఆర్ఎం యేసుదానం తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఎపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: