APSRTC_Bus_Charges_Hike: ఏపీఆర్టీసీలో రాయితీల కోత.. ప్రయాణికులపై ఛార్జీల మోత.. APSRTC Bus Charges Hike: జగన్ హయాంలో ఆర్టీసీ రూటే సెపరేటు అన్నట్లుంది పరిస్థితి. ఇష్టారీతిన ఛార్జీలు పెంచేసిన ఆర్టీసీ.. ప్రయాణికుల ముక్కు పిండి మరీ టికెట్ డబ్బులు వసూలు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు గతంలో ఇచ్చిన రాయితీలకు.. జగన్ సర్కార్ మంగళం పాడింది. దీనివల్ల 35 లక్షల మంది ప్రయాణికులు ప్రభుత్వ రవాణాకు దూరమయ్యారు.
అధునాతన హంగులు.. అత్యుత్తమ సదుపాయాలు.. ఆర్టీసీ స్టార్‌లైనర్ బస్సు ప్రయాణం
Bus Charges Hike in AP: ఏపీఎస్ఆర్టీసీ అంటే కొంతమేర సేవాదృక్పథంతో వ్యవహరించే సంస్థగా ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే చాలా ఏళ్లుగా వివిధ వర్గాలకు రాయితీలు ఇస్తూ.. తక్కువ ధరలతో ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందీ సంస్థ. గత ప్రభుత్వాలు అందించిన ప్రోత్సాహంతో రాయితీలు ఇచ్చేందుకు ఆర్టీసీ మొగ్గు చూపేది. ప్రైవేట్ వైపు చూసే ప్రయాణికుల్ని ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు "నవ్య క్యాట్ కార్డు", నెలవారీ సీజన్ టికెట్లు జారీ చేసేది. 250 రూపాయలు వెచ్చించి నవ్య క్యాట్ కార్డు కొంటే.. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ 10 శాతం రాయితీ ఇచ్చేవారు. కార్డుదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు బీమా సదుపాయం ఉండేది. ఇవే కాకుండా 7 రోజులపాటు చెల్లుబాటయ్యేలా విహారి ప్రత్యేక కార్డులను కూడా ఆర్టీసీ జారీ చేసేది. ఈ కార్డులకు అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ 50 శాతం రాయితీ లభించేది. ఇక 100 రూపాయలతో వనిత ఫ్యామిలీ కార్డు కొంటే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 10 శాతం రాయితీ పొందే ఛాన్స్ ఉండేది.
ఏపీఎస్ఆర్టీసీ ఆదాయానికి 'ప్రైవేటు' పంక్చర్!
APSRTC Subsidy: ఆర్టీసీని బలోపేతం చేస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన సంగతి మరిచిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి చేతులు దులిపేసుకున్నారు. కొవిడ్ సాకుతో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాయితీలన్నింటినీ రద్దు చేశారు. కొవిడ్ తర్వాత పునరుద్ధరిస్తామని నమ్మబలికి.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ సర్కార్.. తరచుగా ఛార్జీలు పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు క్రమంగా ప్రైవేట్ బస్సుల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల నాలుగేళ్లలోఆర్టీసీ ప్రయాణికులసంఖ్య 72 లక్షల నుంచి 37.33 లక్షలకు పడిపోయింది.
YCP Govt Canceled APSRTC Subsidies: ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచాల్సిన ఆర్టీసీ.. క్రమంగా కుదిస్తుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరోక్షంగా ప్రైవేట్‌కు ప్రభుత్వం సహకరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీలో బస్సుల కొనుగోలుకు మొగ్గుచూపని ప్రభుత్వం.. అద్దె బస్సుల పెంపునకు మాత్రం పచ్చజెండా ఊపుతోంది. ఈ పరిణామాలు సంస్థ నష్టాలకు కారణమవుతున్నాయి. బస్టాండ్లు, బస్‌స్టాప్‌ల వద్ద అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోతున్నారు. పండుగలు, రద్దీ వేళల్లో సరిపడా సర్వీసులు అందుబాటులో లేక.. ప్రజలు ప్రైవేట్ సర్వీస్‌ల దోపిడీకి గురవుతున్నారు.
ఖమ్మం భారాస సభకు ఏపీఎస్ఆర్టీసీ సహకారం.. ఎన్టీఆర్ జిల్లా ప్రయాణికులకు తిప్పలు