APPSC Notifications Not Released In Andhra Pradesh :ఇవిగో పోస్టులు, నోటిఫికేషన్లు అంటూ వైసీపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను ఊరించి మోసగిస్తోంది. 2021 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూపు2, కళాశాలల లెక్చరర్ల పోస్టులు, 5 ఇతర పోస్టుల భర్తీకి ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. సీఎం జగన్ చెప్పినవీ అమలు కాకపోతుండటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
CM Jagan Cheating Unemployed Youth :2021 జూన్ 18న, గత ఏడాది మార్చిలో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా గ్రూపు-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ఇప్పటికీ జారీ చేయలేదు. గ్రూపు-1, గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటిని పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. చివరికి గ్రూపు-1 కింద 110, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి 2022 మార్చి 31న ఆర్థికశాఖ మరో జీఓ జారీ చేసింది.
జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయింది: లోకేశ్
No Job Calendar in YSRCP Government :గ్రూపు-1 నియామకాలు పూర్తయ్యాయి. మిగిలిన నోటిఫికేషన్లు రానేలేదు. తర్వాత మళ్లీ గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టుల్ని కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి నవంబరు ఆఖరులోగా నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 267, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 99తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల పోస్టులూ ఉన్నాయి.