ఉద్యోగస్తుల పట్ల మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవరిస్తున్న తీరు సరైనది కాదని... ఉద్యోగుల జోలికొస్తే సహించేది లేదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.... తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళి ఉద్యోగులపై దుర్బాషలాడి... సిబ్బందిని చెట్టుకు కట్టేసి కాల్చేస్తామని బెదిరించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేయమని ఒత్తిడికి గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రవి కుమార్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
"కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి" - Apngo_President_Fire_On_Ex_MLA_Ravi
ఉద్యోగులపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి