Apartments Waste Water in Crop Fields: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలకు నీరు రాకుండా ఉన్న అడ్డంకులు తొలగించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసానికి కొద్ది దూరంలోనే రైతులు తమ పొలాలకు నీరు అందక దిక్కుతోచని స్థితిలో అవస్థలు పడుతున్నారు.
Farmers Facing Problems in AP: తాడేపల్లి జాతీయ రహదారి వెంట వందల కొద్ది బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న పొలాల్లో అపార్ట్మెంట్లు వెలిశాయి. అయితే నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకపోవడం.. రైతులకు తలనొప్పిగా మారింది. అపార్ట్మెంట్లలో మురుగు నీరు పారేందుకు నగరపాలక సంస్థ ఎలాంటి మార్గం చూపకపోవడంతో.. ఆ నీటిని పక్కనే ఉన్న పంట కాలువలోకి వదులుతున్నారు.
కౌలు రైతులకు భరోసా హామీని విస్మరించిన జగన్ - హామీల్లో 99% అమలు చేయడమంటే ఇదేనా?
Farmers Worry About Crop Loss:తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెండలలో పంటలను కాపాడటం కోసం 50 ఏళ్ల క్రితం బకింగ్ హామ్ కెనాల్‌పై 'ఆంధ్రరత్న ఎత్తి పోతల' పథకం ఏర్పాటు చేశారు. 3వేల 500లకు పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు అక్కడి నుంచి కాలువ తవ్వారు. ఈ మూడు గ్రామాల్లో పంటలు పండించేందుకు ఈ కాలువే ఆధారం. ప్రస్తుతం ఈ కాలువలో మురుగునీరు చేరి గరళంగా మారుతోంది. ప్రత్యామ్నాయం చూపించాల్సిన అధికారులే అపార్ట్మెంట్ల పక్కనే మోటార్లు ఏర్పాటు చేసి మరీ మురుగునీటిని పంట కాలువలోకి వదులుతున్నారు.