AP YCP Leaders Apply for Liquor Shops in Telangana: సంస్థలే కాదు మద్యం వ్యాపారులు కూడా తెలంగాణా బాటే.. All Liquor Business in AP is Under Monopoly of Govt Officials:అమరరాజా, ఫాక్స్‌కాన్, లులూ వంటి దిగ్గజ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులే కాదు.. చివరికి మద్యం వ్యాపారులు సైతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బాటపట్టారు. అలాగని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లుగా ఏపీలో దశలవారీ మద్య నిషేధమేమి అమలు జరగట్లేదు. పేరుకు ప్రభుత్వ నిర్వహణలో దుకాణాలు కొనసాగుతున్నా ఇక్కడ మొత్తం మద్యం వ్యాపారమంతా ప్రభుత్వ పెద్దల గుత్తాధిపత్యంలోనడుస్తోందన్న విమర్శలున్నాయి. తమకు కావాల్సినవారి డిస్టలరీల నుంచి మద్యం కొనుగోలు మొదలుకుని దుకాణాల్లో విక్రయం వరకూ.. టోకు, చిల్లర వ్యాపారమంతా ఓ ఎంపీ, అతని ప్రతినిధి కనుసన్నల్లోనే కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి.
Illegal Liquor Selling YSRCP Leader Arrest : "నేను అధికార పార్టీ నాయకుడిని.. నన్నే అరెస్టు చేస్తారా?".. వైసీపీ నేత ఆగ్రహం
Liquor merchants who migrated from AP to Telangana:ఏపీలో ఏటా జరుగుతున్న వేల కోట్ల విలువైన మద్యం వ్యాపారంలో అంతిమ లబ్ధి పొందుతున్నది కూడా ఆ ప్రభుత్వ పెద్దలు, వారికి అత్యంత సన్నిహితులైన ఓ పదిమంది మాత్రమే. అధికార పార్టీ నాయకులకు మద్యం వ్యాపారం ఓ ప్రధాన ఆదాయ వనరు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఈ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఏపీలో ప్రస్తుతం అత్యధిక శాతం బార్‌లు వైసీపీ నాయకుల ఆధీనంలోనే ఉన్నాయి. దానిపై ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో వారికి బాగా తెలుసు. ఏపీలో మద్యం వ్యాపారంలోప్రభుత్వ పెద్దల గుత్తాధిపత్యం నడుస్తుండటంతో.. వైసీపీ నాయకులు, మద్యం వ్యాపారులు తెలంగాణ బాట పట్టారు. ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. కొందరు వైసీపీ నాయకులు తెరవెనక ఉండి సిండికేట్ల ద్వారా వ్యవహారాలు నడిపించగా.. మరికొందరు ప్రత్యక్షంగానే ప్రయత్నాలు చేశారు. వీరిలో కొంతమందికి అక్కడ మద్యం దుకాణాల లైసెన్సులు లభించాయి.
Drugs in Andhra Pradesh: మాదక ద్రవ్యాల మత్తులో బాలలు.. వినియోగంలో ఏపీ స్థానం ఎంతంటే..!
YCP leaders from AP apply for liquor shop licenses:ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులు మద్యం వ్యాపారులతో సిండికేట్లుగా ఏర్పడి తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకోవడం కోసం సుమారు7 వేలకు పైగా దరఖాస్తులు చేసినట్లు అనధికారిక అంచనా. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షలు చొప్పున 140 కోట్లకు పైగా నాన్ రిఫండబుల్ రుసుములు చెల్లించారు. ఒక్కో సిండికేట్ తరఫున కనీసం 500 నుంచి 2,000 వరకూ దరఖాస్తులు చేయగా.. లాటరీలో కొన్ని సిండికేట్లకు నాలుగైదు, మరికొన్ని సిండికేట్లకు పది వరకూ మద్యం దుకాణాల లైసెన్సులు లభించాయి. తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గతంలో 68,691 దరఖాస్తులు రాగా.. ఈ దఫా 1,31,490 దరఖాస్తులొచ్చాయి. ఈ సంఖ్య భారీగా పెరగటానికి ఏపీ నుంచి వెళ్లిన మద్యం వ్యాపారులు కూడా కారణమే.
YSRCP Leaders ruckus on Excise Police: సెబ్ స్టేషన్లో వైసీపీ నాయకుడి వీరంగం..
District wise licenses issued..
- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు, వైసీపీ నాయకులు సిండికేటుగా ఏర్పడి 1,000కు పైగా దరఖాస్తులు చేశారు. వారికి 10 వరకూ మద్యం దుకాణాల లైసెన్సులు లభించినట్లు సమాచారం.
- పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ బృందం 600 దరఖాస్తులు చేయగా.. వారికి నాలుగు దుకాణాలు లభించాయి.
- విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన మద్యం వ్యాపారి ఒక్కరే తన తరఫున 150 దరఖాస్తులు చేయగా.. కొన్ని దుకాణాల లైసెన్సులు దక్కాయి.
- విశాఖపట్నం కేంద్రంగా చాలాకాలంగా మద్యం వ్యాపారంలో కొనసాగుతూ..స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారి ఒకరు ఒక గ్రూపుగా ఏర్పడి భారీ సంఖ్యలో దరఖాస్తులు చేయగా 10 వరకూ దుకాణాలు లభించాయి.
- నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారి ఒకరు 250 దరఖాస్తులు చేశారు. ఇదే జిల్లాకు చెందిన మరో సిండికేట్ 500కు పైగా దరఖాస్తులు చేసింది. వీరికి చెరో నాలుగేసి దుకాణాలు దక్కాయి. తెలంగాణలోని కొంతమంది వ్యాపారులతో కలిసి మరికొందరు దరఖాస్తులు చేశారు.
- కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోగా వారికి కొన్ని దుకాణాలు లభించాయి.