ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఫిర్యాదు.. స్పీకర్‌ కోడెల శివప్రసాద్​పై కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికల వేళ జరిగిన గొడవలకు సంబంధించి... ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్​పై కేసు నమోదైంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో.. చాలాసేపు ఉండటంతో పాటు, ఓటర్లను బెదిరించారంటూ వైకాపా నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాద్​పై కేసు నమోదు

By

Published : Apr 16, 2019, 6:01 PM IST

Updated : Apr 16, 2019, 6:33 PM IST


ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్​పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ జరిగిన సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్​లోకి వెళ్లి.. అక్కడ చాలాసేపు ఉండడంతో పాటు, ఓటర్లను బెదిరించారంటూ వైకాపా చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ తర్వాత తదుపరి చర్యలుంటాయాని పోలీసులు తెలిపారు. మరోవైపు అదేరోజున కోడెలపై దాడికి పాల్పడినందుకు వైకాపాకు చెందిన 20 మంది కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Apr 16, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details