రేపు కొండవీటి ఉత్సవాలకు సీఎం! - bus facilities
కొండవీడుకోట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. గత చారిత్రక వైభవాన్ని చాటిచెబుదాం... కొండవీడు ఉత్సవాలను విజయవంతం చేద్దాం...అనే నినాదంతో నేటి నుంచి రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లా కొండవీడు కోట ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమైయ్యాయి. ఈవేడుకలకు మంత్రులు చినరాజప్ప,సోమిరెడ్డి, పుల్లారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గత చారిత్రక వైభవాన్ని చాటిచెబుదాం...కొండవీడు ఉత్సవాలను విజయవంతం చేద్దాం... అనే నినాదంతో నేటి నుంచి రెండు రోజులు పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. వేడుకలను ప్రారంభించిన మంత్రులు.. అనంతరం కొండవీటి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. వినోద, సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.3 కోట్లు కేటాయించినట్లు... గుంటూరు, చిలకలూరిపేట నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించినట్లు ప్రకటించారు. రేపు జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు.