భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు అడవితక్కెళ్లపాడులో నూతనంగా నిర్మిస్తున్న క్రిస్టియన్ భవన నిర్మాణ పనులను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. పనుల పురోగతి పై అధికారులతో చర్చించారు. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న క్రిస్టియన్ భవనం....అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా తీర్చిదిద్దనున్నారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు.