- పెన్షన్ సొమ్ములో దొంగనోట్ల ఘటన .. నోట్లు మార్చింది అతడేనట..?
Narsayapalem fake notes Incident update: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. పెన్షన్ సొమ్ములో దొంగనోట్ల ఘటనలో వాలంటీరే నిందితుడని తేలింది. నిన్న ప్రకాశం జిల్లాలో వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల డబ్బులో దొంగ నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎంపీడీఓ సుబ్బారాయుడు కీలక సమాచారాన్ని బయటపెట్టాడు. పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లను మార్చిన వ్యక్తి వాలంటీరేననని వెల్లడించారు.
- కేంద్రం ఇచ్చే బియ్యానికి అడ్డెందుకు..5నెలల బియ్యాన్ని నిలిపేసిన ప్రభుత్వం
Ration Distribution: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందనీయట్లేదు. గతేడాది అక్టోబరులో ఇవ్వాల్సిన కోటా బియ్యాన్ని.. ఈ ఏడాది జనవరిలో ఇస్తామని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు దాని ఊసే మరచింది. గతేడాదిలో 5 నెలల పంపిణీకి మోకాలడ్డింది.
- రాష్ట్రంలోని ఎయిపోర్టుల్లో నిలిచిన కార్గో సేవలు.. అనుమతులపై ఆరు నెలల ముందే సూచన
Cargo Services at Airports Have Stopped: విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం సహా దేశంలోని 20 విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు జనవరి1 నుంచి నిలిచిపోయాయి. అనుమతులను పునరుద్ధరించుకోవాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆరు నెలల కిందట సూచించినప్పటికీ.. జరగకపోవడంతో తాజాగా సరకు రవాణా సేవలను ఆపేస్తున్నట్టు బీసీఎఎస్ ప్రకటించింది.
- హరిరామ జోగయ్య ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన
Pawan Kalyan Comments: కాపు రిజర్వేషన్ కోసం చేగొండి హరిరామ జోగయ్య తలపెట్టిన దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని పవన్ కోరారు
- ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీతో ఆమెకు వల.. రూ.25 లక్షలు కాజేసి, న్యూడ్ ఫొటోస్‌తో బెదిరించి..
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీతో ఓ మహిళను మోసం చేసి రూ.25 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- రెండు నెలల చిన్నారిపై తల్లి దారుణం.. ఆస్పత్రి మూడో ఫ్లోర్ నుంచి కిందకు పడేసి..
రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది ఆమె తల్లి. ఈ హృదయవిదారక ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పుట్టినప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల ఇలా చేశానని నిందితురాలు పోలీసుల విచారణలో చెప్పింది. మరోవైపు, ఆవుదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
- నెలన్నర నుంచి ఒకేచోట ఉంటున్న నాగుపాము.. తరలివస్తున్న భక్తులు
మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో నెలన్నర నుంచి నివాసముంటున్న ఓ నాగుపాము అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలో జరిగింది. దీంతో రోజూ అధిక సంఖ్యలో ప్రజలు ఆ పామును చూసేందుకు తరలివస్తున్నారు.
- బీచ్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. నలుగురు మృతి
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
- 'అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు కోహ్లీ చెప్పిందే ఫాలో అవుతున్నారు'.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్
ఒకప్పుడు టీమ్ఇండియా విషయంలో విరాట్ కోహ్లీ చెప్పిన సూచనల్ని పట్టించుకోలేదు బీసీసీఐ. అయితే, ఇప్పుడు అతడి సూచనలనే పాటిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌నకు 20 మందిని ఎంపిక చేసిన క్రికెట్ బోర్డు.. కోహ్లీ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయంపై కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అప్పట్లో కోహ్లీ సూచనలు పాటించి ఉంటే.. ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియా మరింత మెరుగ్గా రాణించేదని అంటున్నారు.
- సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'శాకుంతలం' విడుదలయ్యేది అప్పుడే
Shakuntalam Release Date : 'శాకుంతలం' మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తీపి కబురు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఎప్పుడంటే?