- MURMU : శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
- ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..!
ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 15న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండగా.. మార్చి 16వ తేది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
- పింఛన్ తొలగింపుపై ఆందోళన.. 'స్పందన'కు వందల సంఖ్యలో బాధితులు
PENSIONERS PROTEST AT NELLORE : నెల్లూరు జిల్లాలో ఫించన్ తొలగించిన వారి రోదనలు ఆకాశానంటుతున్నాయి. పింఛన్ డబ్బులతోనే జీవనం సాగిస్తున్న వారికి.. ఇప్పుడు దానిని నిలిపివేయడంతో అల్లాడుతున్నారు. కాస్తో కూస్తో వచ్చే డబ్బులతోనే వారికి ఇంట్లో గౌరవం ఉందంటున్నారు. ఇప్పుడు అలాంటి పింఛన్లు తీయొద్దని ఎమ్మెల్యేను కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం వాటిని పునరుద్ధరించడానికి సమయం ఎక్కువ పడుతుందని మాట దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.
- 'రాయలసీమ వాసులను ప్రభుత్వం మోసం చేస్తోంది'
Lawers Protest for Judicial Academy: కర్నూలు హైకోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ వాసులను మోసం చేస్తుందని కర్నూలు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఇస్తామని 152 జీవోను ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రద్దు చేశారని కర్నూలు న్యాయవాదులు ప్రశ్నించారు.
- భారత జలాల్లో పాక్ పడవ.. రూ.300 కోట్ల డ్రగ్స్, గన్స్‌తో అనుమానాస్పదంగా..
ఆయుధాలు, మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవను కోస్టుగార్డు అధికారులు సీజ్ చేశారు. 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పడవలో 40 కేజీల డ్రగ్స్ దొరికాయని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని చెప్పారు.
- ఎయిమ్స్‌లో చేరిన నిర్మలా సీతారామన్.. వైరల్ ఫీవర్ లక్షణాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కడుపులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్తో ఆమె ఎయిమ్స్‌కు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించాయి.
- నేపాల్‌కు కొత్త ప్రధాని.. 'ప్రచండ' ప్రమాణస్వీకారం.. మూడోసారి బాధ్యతలు
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో.. మూడోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.
- 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల డేటా చోరీ.. సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్ఓ సహా..
ట్విట్టర్‌కు సంబంధించిన 40 కోట్ల మంది వినియోగదారుల డేటాను చోరీ చేసినట్లు హ్యాకర్ తెలిపాడు. ట్విట్టర్ తన నుంచి ఈ డేటాను కొనుకోలు చేయవచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ డేటా చోరీకి గురైనట్లు పేర్కొంది.
- న్యూజిలాండ్ అరుదైన రికార్డు.. 145 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..
పాకిస్థాన్‌తో తలపడుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరుదైన ఘనతను సాధించింది. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా రికార్డు సృష్టించింది. అదేంటంటే?
- 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్ అదుర్స్.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
మెగాస్టార్ చిరంజీవి మాస్ గెటప్‌లో వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదలైంది.
ఏపీ ప్రధాన వార్తలు