- బండరాళ్ల నుంచి క్షేమంగా బయటపడిన రాజు
Man trapped inside cave and rescued: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాల్లో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుని నరకయాతన అనుభవించిన యువకుడు రాజును అధికార యంత్రాంగం రక్షించింది. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతడిని కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఎస్‌బీ 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకలకు పాల్గొననున్న చంద్రబాబు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ ముంగిపు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్‌లో ఐఎస్‌బి ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేశారు. 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ ఐఎస్‌బీ సంస్థ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు.. అరుణవర్ణమైన విజయవాడ
BHAVANI DEEKSHA VIRAMANA AT VIJAYAWADA : జై దుర్గా.. జయజయదుర్గా.. అంటూ విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది. అమ్మవారి మాలలు ధరించిన భక్తులు భవానీ శరణుఘోషతో అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. త్రికాల రూపాణి, త్రిభువనేశ్వరి తమపై చల్లని చూపులు చూడాలని ఆర్తిగా వేడుకుంటున్నారు. మండల, అర్ధమండల భవానీ దీక్షలు వేసిన వారంతా ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు జరగనున్న మాల విరమణ కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఎర్రనివస్త్రాలు ధరించిన దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణశోభితంగా ప్రకాశిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాడి రైతులను జగన్ మోసం చేశారు: టీడీపీ నేత పట్టాభిరామ్
Jagan cheated the dairy farmers: పాడిరైతులను జగన్మోహన్రెడ్డి మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అధికారంలోకి వస్తే లీటర్ పాలకు 4 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పిన జగన్, మాట తప్పారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 39కి చేరిన కల్తీ మద్యం మృతులు.. పరిహారం ఇచ్చేదే లేదన్న సీఎం
బిహార్ ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 39కి చేరింది. ఈ ఘటనపై అధికారప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాగం జరుగుతోంది. కాగా, ఈ ఘటనలో చనిపోయిన మృతులకు పరిహారం ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆడపిల్ల పుట్టిందని వేడుక ఆస్పత్రి నుంచి ఇంటివరకు రథంలో ఊరేగింపు
ఆడపిల్లల్ని పురిటిలోనే చంపేస్తున్న తరుణంలో ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలించింది. ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగించారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సాగర్, జాన్వి దంపతులు రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పసిపాపను రథంపై ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు భాజాలతో, బంధువుల కోలాహలం మధ్య ఊరేగించారు. కాగా, తాము ఎప్పుడూ ఆడపిల్లలను తక్కువ చేసి చూడలేదు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఫోన్లో ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే.. 'ప్రో' ఫొటో నిపుణులు మీరే!
ఐఫోన్ల కెమెరా సామర్థ్యమే వేరు. వీటి ఫొటోల స్పష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రో సిరీస్ ఫోన్లయితే మరింత క్వాలిటీతోనూ ఫొటోలు తీస్తాయి. అయితే కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే.. మీరు తీసే ఫొటోలు అదిరిపోతాయంతే. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- IND VS BAN: టీమ్ఇండియా ఆలౌట్.. రాణించిన పుజారా, శ్రేయస్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ అవార్డుల పరంపర.. ఏకంగా ఐదు నామినేషన్లు..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' అవార్డుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 'క్రిటిక్ ఛాయిస్ అవార్డు'ల్లో ఐదు క్యాటగిరీల్లో నామినేషన్లు సాధించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు